మ‌హారాష్ట్ర‌ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు కోవిడ్ పాజిటివ్‌

ముంబయి : మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు క‌రోనా వైర‌స్ సోకినట్లు కాంగ్రెస్​ సీనియర్​ నేత కమల్​ నాథ్ తెలిపారు. శాసనసభ రద్దుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నడుమ రాష్ట్ర కేబినెట్​ భేటీ అయింది. సీఎం ఠాక్రే.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా హాజరయ్యారు.

మ‌రో వైపు ఆ రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. శివ‌సేన‌కు చెందిన మంత్రి ఏక్‌నాథ్ షిండే సుమారు 40 మంది ఎమ్మెల్యేల‌తో అస్సాం వెళ్లారు. దీంతో ఉద్ద‌వ్ నేతృత్వంలోని మ‌హా వికాశ్ అవ‌ధి కూట‌మి మైనార్టీలో ప‌డింది. అయితే సంక్షోభంపై ఉద్ద‌వ్‌తో చ‌ర్చించేందుకు కాంగ్రెస్ నేత క‌మ‌ల్‌నాథ్ ప్ర‌య‌త్నించారు. కానీ ఆ చ‌ర్ఛ‌లు జ‌ర‌గ‌లేదు. ఉద్ద‌వ్ కోవిడ్ పాజిటివ్ అని, దాని వ‌ల్లే ఆయ‌న్ను క‌ల‌వ‌లేక‌పోయిన‌ట్లు క‌మ‌ల్‌నాథ్ తెలిపారు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోశియారికి కూడా క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. రిల‌య‌న్స్ ట్ర‌స్ట్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న చేరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/