సినీ కార్మికులు చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలి

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ కార్మికుల సమ్మెపై స్పందించారు.సినీ కార్మికులు చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. కరోనా కారణంగా కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. ఫిలిం చాంబర్, ప్రొడ్రూసర్ కౌన్సెల్ కార్మికులను చర్చలకు పిలవాలన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొదన్నారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని తెలిపారు. లేబర్ డిపార్ట్ మెంట్ కు సమ్మె లేఖ ఇవ్వలేదన్నారు. రెండు మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని తలసాని సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/