ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల

అమరావతి : ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మే 6 నుంచి 25 వరకు పరీక్షలు జరిగాయి. ఫస్ట్ ఇయర్ లో 4,45,358మంది విద్యార్థులు పరీక్ష రాశారు. సెకండ్ ఇయర్ లో 4,23,455మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 72,299 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్ లో 2,41,591 మంది విద్యార్థులు పాసయ్యారు. అలాగే సెకండ్ ఇయర్ లో 2,58,449 మంది విద్యార్థులు పాసయ్యారు. ఫలితాలను https://examresults.ap.nic.in www.bie.ap.gov.in వెబ్‌సైట్లలో చూసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది.

ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో 54 శాతం.. ద్వితీయ సంవత్సరంలో 61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం.. బాలికలు 65 శాతం ఉత్తీర్ణత పొందారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 59 శాతం.. బాలికలు 68 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతలో ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్‌లో నిలువగా.. చివర్లో ఉమ్మడి కడప జిల్లా నిలిచింది.

గతం కంటే ఈసారి బాగా ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్టియర్‌లో 2,41,599 మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్‌లో 2,58,449 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 25 నుంచి జూలై 5 వరకూ రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/