కొనసాగుతున్న మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం ఎనిమిది గంటలకు ఈ లెక్కింపు మొదలైంది. ఈ ఎన్నికలో 1,437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం ఐదు టేబుళ్లను ఏర్పాటు చేశారు. సాయంత్రానికి ఫలితం తేలే అవకాశం ఉంది.

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి అ సెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారడం.. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.