‘విద్యా కానుక’ కిట్లను సిద్ధం చేసిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందించే విద్యా కానుక కిట్లను అధికారులు సిద్ధం చేశారు. వాటిని మండల స్టాక్ పాయింట్లకు చేరవేశారు. జూన్ 12న స్కూళ్లు తెరిచిన తొలిరోజే వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విద్యాకానుక కిట్లో బ్యాగు, బెల్టు, బూట్లు, సాక్సులు, పాఠ్య, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్, డిక్షనరీ, యూనిఫామ్ క్లాత్ ఉంటాయి. ఈ ఏడాది 38లక్షల మంది స్టూడెంట్లకు కిట్లను అందించనున్నారు. జగనన్న విద్యా కానుక 2021 ఆగస్టు 16న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రారంభించబడింది. ఈ పథకంలో, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.