హీరోయిన్ రంభ పెను ప్రమాదం నుండి బయటపడ్డారు

హీరోయిన్ రంభ పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. రంభ తన ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రంభ ఫ్యామిలీ కి గాయాలయ్యాయి. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంతో తన ఫ్యామిలీకి అందరికీ గాయాలయ్యాయని రంభ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. అయితే అవన్నీ చిన్న గాయాలేనని, కానీ తన కూతురు సాష మాత్రం ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉందని చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

స్కూల్ నుంచి పిల్లలను పికప్ చేసుకుని వస్తుండగా, ఇంకోకారు అనుకోకుండా తమ కారును ఢీ కొట్టిందని, ఈ ప్రమాదంలో అందరికీ చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కానీ నా కూతురు సాష మాత్రం ఇంకా హాస్పిటల్ లోనే ఉంది. తను త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించండి. మాకు ఈ రోజు టైం ఏం బాగాలేదు. బ్యాడ్ టైం బ్యాడ్ డేస్, ఈ సమయంలో మీ ప్రార్థనలో మాకు ఎంతో అవసరం అంటూ రంభ తెలిపింది.