‘లవ్ స్టోరీ’ సక్సెస్ సంబరాలు

'లవ్ స్టోరీ' సక్సెస్ సంబరాలు

నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రతి చోట సినిమాకు బ్రహ్మ రధం పడుతుండడం..మొదటి రోజు నాగ చైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు రావడం తో అభిమానులు, చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.

సినిమా సక్సెస్ సందర్భంగా అక్కినేని నాగార్జున చిత్ర బృందానికి పార్టీ ఇచ్చారు. సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో కేక్ కట్ చేశారు. ఆ పార్టీకి బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా హాజరయ్యారు. నాగచైతన్యతో పాటు అఖిల్ , శేఖర్ కమ్ముల, సాయిపల్లవి లు హాజరై, సక్సెస్ సంబరాలను పంచుకున్నారు. పార్టీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ సక్సెస్ పార్టీలో సమంత ఎక్కడా కనిపించలేదు. ఇప్పటికే వారిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారంటూ వార్తలు వైరల్ కావడంతో వాటిని చైతూ ఖండించాడు. మొదట్లో కొంచెం బాధపడినా.. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చాడు. కానీ అక్కినేని వారింట ఏ సంబరం జరిగిన వాటికీ సమంత దూరంగా ఉండడం అనేక అనుమానాలకు దారితీస్తుంది.