ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి ‘వార్త’
‘టెర్మినల్ బెనిఫిట్స్.. ఇక నేరుగా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యూటీ చెల్లింపు

Amaravati: ఏపీఎస్ ఆర్టీసీలో 2020, జనవరి 1 తర్వాత రిటైరైన, ఉద్యోగాల నుంచి వైదొలగిన వారికి టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపునకు ప్రభుత్వం తీపి వార్త అందించి మార్గం సుగమం చేసింది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ చెల్లింపుల కోసం అకౌంట్ హెడ్ నంబర్లు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకున్న ఈ ప్రత్యేక అకౌంట్ హెడ్ కేటాయింపులు తొలిసారిగా ఆర్టీసీ ఉద్యోగులకూ రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేసింది. దీంతో సీఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ చెల్లిస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సంస్థ ఉద్యోగులకూ ఈ అవకాశం కలిగింది. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను వర్తింపజేసింది.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/