గొంతు పెంచడం ద్వారా కోర్టును బెదిరించలేరుః న్యాయవాదిపై సేజేఐ ఆగ్రహం

వాదనల సందర్భంగా గట్టిగా మాట్లాడిన న్యాయవాది

‘Lower your pitch’.. Chief Justice Chandrachud pulls up lawyer in Supreme Court

న్యూఢిల్లీః సుప్రీంకోర్టులో నిన్న అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తనకు ఇబ్బంది కలిగించిన ఓ న్యాయవాదిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే… ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది గట్టిగా మాట్లాడుతుండటంతో సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. గొంతు పెంచడం ద్వారా కోర్టును బెదిరించలేరని అన్నారు.

దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో మీరు వాదించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. జడ్జిల దగ్గర మీరు ఎప్పుడూ ఇలాగే వాదిస్తుంటారా? అని అడిగారు. సంయమనం పాటించాలని సూచించారు. దీంతో చీఫ్ జస్టిస్ కు సదరు న్యాయవాది క్షమాపణ చెప్పారు. గతంలో కూడా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఇలాగే మాట్లాడటంతో తగ్గాలంటూ సీజేఐ అసహనం వ్యక్తం చేశారు.