అంధుల ఆరాధ్య దైవం లూయిస్‌ బ్రెయిలీ

నేడు లూయిస్‌ బ్రెయిలీ జయంతి

Louis Braille
Louis Braille

ఒక నిముషం కళ్లు మూసుకొని చుట్టూ చూస్తే అంతా అగమ్యగోచరంగా ఉంటుంది. మరి జీవితాంతం కళ్లు లేక చుట్టూ ఉన్న అందాలను చూడలేక తమకున్న అంధ త్వాన్ని దూషించుకుంటున్న అంధులెందరో ఇలాంటి వారం దరూ నిరాశానిస్పృహలతో కృంగిపోకుండా అంధుల కోసం మహోన్నతమైన కృషి చేయ జన్మించిన అంధుల ఆరాధ్య దైవం, గురువు లూయీస్‌ బ్రెయిలీ. సూర్యకాంతి పడని ప్రతి భాగంలో కూడా కవి చూడగలడని ఒక సామెత.

కవి తన ఊహా సూక్ష్మదృష్టితో సృష్టిలోని అందాలను, నిగూఢమైన విషయాలను ప్రకృతి అంశాలను అందరికి చూపించగలడు. ఇలా వచ్చిన విషయాలన్నీ అక్షర రూపంలో ఉంటాయి. ఈ విజ్ఞానాన్ని మనం మన అమూల్యమైన కన్నులతో చూసి, చదివి హృదయానందాన్ని పొందగలం. దురదృష్టవశాత్తు కొందరు విధివంచనకు గురై మరికొందరు అంధులుగా ఉన్నా రు. ఈ సృష్టి అందాలను చూడలేని నిర్భాగ్యులూ ఉన్నారు.

ఇలాంటి వారందరూ నిరాశానిస్పృహతో కృంగిపోకుండా, వారి విజ్ఞాన జీవితాలకు దిక్సూచిలా, మహోన్నత గురువులా ఈ నేలపైన జన్మించాడు లూయిస్‌బ్రెయిలీ. లూయిస్‌ బ్రెయిలీ ఒక ఫ్రెంచ్‌ విద్యావేత్త. బ్రెయిలీ లిపి సృష్టికర్త.

1809 సంవత్స రం జనవరి 4వ తేదీన ‘పారిస్‌ దగ్గరలోని ‘క్రూవే గ్రామంలో ‘మోనిక్‌ బ్రెయిలీ, సైమన్‌ రెనె బ్రెయిలీలకు లూయిస్‌ బ్రెయిలీ జన్మించాడు. తండ్రి చేసే పనిని అనుకరిస్తూ పొరపాటున ఒక కంట్లో ఇనుప చువ్వగుచ్చుకున్నాడు.

కొద్దీరోజుల్లోనే మరో కన్నును కూడా కోల్పోయి నాలుగేండ్లు నిండేసరికి పూర్తి గుడ్డి వాడు అయ్యాడు. 1784 సంవత్సరంలో ‘స్పెయిన్‌ దేశానికి చెందిన ‘ఫ్రాన్సిక్కోలూకాస్‌ అక్షరాలను చెక్కమీద ఉబ్బెత్తుగా ఉండేటట్లు రూపొందించి అంధులకు చదవడానికి అనుకూలం గా మార్చాడు.

లూకాస్‌ కనుగొన్న ఉబ్బెత్తు అక్షరాల ద్వారా అంధులకు విద్యను నేర్పే పాఠశాలను 1784వ సంవత్సరంలో పారిస్‌’వాలెంటైన్‌ హ్యూ ప్రారంభించారు. ఈ పాఠశాలలో లూయిస్‌ బ్రెయిలీని చదువ్ఞకొరకు చేర్పించారు. ఆ పాఠశాలలో చేరిన అతి తక్కువ కాలంలోనే ‘లైన్‌టైఫ్‌ పద్ధతిలో విశేష ప్రతిభను ప్రదర్శించాడు బ్రెయిలీ.

ఆ ప్రతిభ వల్ల 17 సంవ త్సరాల వయసులోనే, తను విద్యాభ్యాసం చేసిన పాఠశాల ల్లోనే ‘ఫ్రొపెసర్‌గా నియమించబడ్డాడు. అంధులకు చదువ్ఞ చెప్పాలంటే వారికి పుస్తకాలు కావాలి. కానీ కంటితో వారు చూడలేరు. స్పర్శ తప్పమరో మార్గంలో వారు స్వయంగా చదువుకోలేరు.

అందుచేత మామూలు ప్రింటింగు పద్ధతినికాక, ఎత్తుగా ఉబ్బెత్తుగా వ్ఞండే విధంగా అక్షరాలు ఉన్న పుస్తకాలు మాత్రమే ఉండాలి. పగలు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ, రాత్రి అంధులు తేలికగా చదవగలిగే రాయగలిగే లిపి తయారీకై కృషి చేశాడు. అంధులకు అప్పటి వరకు రాయడం కోసం, చదవడం కోసం ఉన్న విధానాలు సులభంగా లేవని గుర్తించడం వల్ల వారికి అనుకూలమైన విధానం కొరకు అహర్నిశలు కృషి చేశాడు.

అప్పటివరకు ఉన్న ప్రింటింగు విధానం స్పర్శపై ఎక్కువగా ఆధారపడి ఉండాలని గ్రహించి, ఆ అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలు చుక్కలుగా ఉంటే బాగుంటుందని భావించాడు. గీతలు గీతలుగా కాకుండా చుక్కలు, చుక్కలుగా చదవటం సులభం అవుతుందని బ్రెయిల్‌ గుర్తించాడు. 1821లో ‘ఛార్లెస్‌ బార్బి యర్‌ అనే సైనికాధికారి తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందు కు 12 ఉబ్బెత్తు చుక్కలతో రహస్య సంకత లిపిని తయారు చేశాడు.

దీని గురించి తెలుసుకున్న బ్రెయిలీ 12 చుక్కలకు బదులుగా ఆరు చుక్కల ద్వారా అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను సంగీత చిహ్నా లను రూపొందిచాడు. అంధుల కోసం చాలా సులువైన విధానం కనుగొనాలనే సంకల్పంతో మరింత కృషి చేశాడు. 20 సంవత్సరాల యువకుడైన బ్రెయిలీ తన నూతన పద్ధతిని విజయవంతంగా ప్రకటించగలిగాడు. మరో ఐదు సంవత్సరాల పరిశోధనలో బ్రెయిలీ తన పద్ధతిలో సంపూర్ణత సాధించాడు.

‘ఆరు చుక్కలను వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల బ్రెయిలీ ‘మొత్తం అక్షరాలను రూపొందించాడు. ఇది అంధు లకు పెద్ద సంచలన, మంచి మార్పుగా మారింది. ఆరు పాయింట్లు వివిధ రకాలుగా వాడి మొత్తం ఇంగ్లీషు అక్షరాలన్నీ పలికేటట్లు మార్పుచేయడంలో విజయం సాధించాడు.

ఒక చుక్క నుండి ఆరు చుక్కలలోనే మొత్తం అక్షరాలన్నీ తయారు చేయడంలో బ్రెయిలీ కృషి అమోఘం. ఈ విధంగా మొత్తం భాషకు 250 గుర్తులు, ఈ ‘ఆరుచుక్కలలో బ్రెయిలీ రూపొందించాడు. ఈ రకంగా రూపొందించిన విధానంలో అంధులు ఇతరుల సహాయం లేకుండా రాయగలరు. చదవగలరు. అంధులకు ఉపయోగకరమైన లిపిని రూపొందించిన బ్రెయిలీకి బ్రెయిలీ మరణం తర్వాత మాత్రమే అధిక ప్రాచుర్యం లభించింది.

సంగీతాన్ని బ్రెయిలీ లిపితో రాయడం అతని నైపుణ్యానికి నిద్శనం. ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ లిపికి గుర్తింపు అంగీకరించినా, అమెరికా మాత్రం 1916లోనే దానిని ఆమోదించింది. ఈ నిరంతర శ్రమవల్ల 1851లో ‘క్షయవ్యాధికి గురై 1852 జనవరి ఆరున అంధులందరికి వెలుగునందించిన లూయిస్‌ బ్రెయిలీ మరణించారు.

అనంతరం బ్రెయిలీ శిష్యులు తమ గురువ్ఞ రూపొందించిన ‘లిపికి గుర్తింపునివ్వాలని పోరాటం చేయగా, అతని లిపికి అధికార గుర్తింపునిచ్చి బ్రెయిలీని తమ దేశపు ముద్దుబిడ్డగా కొనియాడింది. ‘ఫ్రాన్స్‌ఈ రోజు ప్రపంచంలోని అంధులకు అన్నిరకాల పుస్తకాలు, పత్రికలు, బ్రెయిలీ లిపిలోనే వస్తున్నాయి. అందుకే అంధుల మనసుల్లో వారి మునివేళ్లలో చిరకాలం జీవిస్తూనే ఉంటాడు బ్రెయిలీ.

బ్రెయిలీ మరణం శతాబ్ధి సందర్భంగా 1952లో అతని ఆస్తికలను పారిస్‌లో ‘పాంథియన్‌లోకి మార్చి విశిష్ట వ్యక్తిగా అతనిని గౌరవించారు. బ్రెయిలీ 200 జన్మదినోత్సవం సందర్శంగా 2009లో ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ చేసిన కృషి గూర్చి ప్రచారం చేసి వారి గొప్పతనాన్ని తెలియచేశారు. బెల్జీయం, ఇటలీ దేశాలు బ్రెయిలీ బొమ్మతో రెండు ‘యూరోలు నాణాన్ని విడుదల చేశాయి.

మనభారతదేశంలో బ్రెయిలీ గౌరవార్ధం 2 రూపాయల నాణాన్ని అతని బొమ్మతో విడుదల చేసింది. అదేవిధంగా అమెరికా కూడా ఒక ‘డాలరు నాణాన్ని విడుదల చేసింది. వ్యక్తి ఆ దేశంలో మాత్రమే గొప్పవాడయ్యే అవకాశం ఉంది.

కానీ బ్రెయిలీ అందించిన అద్భుత ప్రక్రియకు విశ్వవ్యాప్త గుర్తింపురావడం అపూర్వం. అంధులకు విద్యాదానం చేసిన మహనీయుడు బ్రెయిలీ. అంధులకే కాక ప్రజలందరికీ చిరస్మరణీయుడు.

  • రఘుపతిరావు గడప

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/