ఏది సత్యం? ఏది అసత్యం..
‘వార్తల్లోని వ్యక్తి’ ప్రతి సోమవారం

ఓ రజనీ! పునరపి మరణం పునరపి శరణం అని గౌతమ బుద్ధుని సూక్తి. ‘మనిషి మరణిస్తాడు, పునర్జన్మ ఎత్తుతాడు అని దీని తాత్పర్యం. ఆయన అవతారంవలెనే ఆయన పార్టీని పెడతానన్న ప్రకటనలు కూడా అలాగే ఉంటాయి.
ఇదుగో పార్టీ, అదిగో పార్టీ అని ఆయన ఊరించు మొగుడా, ఉబ్బించి మొగుడా! అన్నట్టుగా ప్రకటనలు ఉంటాయి. కొంత కాలం రజనీకాంత్, కమలహాసన్ ఆ మధ్యపార్టీలు పెడతామన్న ప్రకటనలు వస్తున్నాయి.
చివరికి నవ్విన నాప చేనే పండిందనట్టు కమలహాసన్ పార్టీ పెట్టారు. రజనీకాంత్ ఈ లోగో ఎన్నోసార్లు పార్టీ పెడుతునంత పనిచేశాడు. కాని, క్రియ శూన్యం. కాని, అంత ధైర్యం లేనివాడు ఆయనకు పార్టీ ఎందుకు? అక్కినేని నాగేశ్వరరావువలె!
కొందరి మనస్సులు, వ్యక్తిత్వాలు పార్టీలకు తగవు. రామారావ్వువలె అక్కినేని పార్టీని పెట్టడంలో చొరవ చూపించాడా? అయితే, రామారావు వలె నాగేశ్వరరావు పార్టీలు పెట్టడంలో చొరవ చూపించాలి.
పార్టీలు పెట్టడానికి చొరవ ఉండాలి. డాషింగ్, డేరింగ్ అండ్ డైనిమిజం ఉండాలి అవి రామారావు వలె నాగేశ్వరరావుకు లేవు.
అందువల్లనే పార్టీని పెట్టరాదని నాగేశ్వర రావు నిర్ణయించుకున్నారు. ఇద్దరూ పార్టీలు పెడితేనా? రామ,రావణ యుద్ధమేగా!
రజనీకాంత్ తన పార్టీకి పేరు కూడా పెట్టాడు. ఏమి లాభం తీరా నూతన సంవత్సరం జనవరి 3న పార్టీ పేరుకు అధికారయుతంగా ప్రకటించుదామనుకుంటున్న సమయంలో ఆయనకు రక్తపుపోటా!
ఆయన ఇంకెప్పుడూ పార్టీని పెడతాననకూడదు. చేరితే కమలహాసన్ పార్టీలో చేరితే, ఈయనే రాణిస్తాడు. ఈయన ముందు కనుక హాసన్ ఎక్కడ ఆగుతాడు? అసలు కమలహాసన్‌తో ఎంత మైత్రివ్ఞన్నా, సింహాంతో చిరుత పులిస్నేహం చేయడానికి సాహసించగలడా?
మొదట మహారాష్ట్రలో రావ్ఞ. అప్పుడు విూ పేరు కర్ణాటకలో బస్‌కండక్టర్. ఇప్పుడు తమిళనాడులో రజనీకాంత్. ఇక, ఏదీ మార్చబోకండి. పేరు, వృత్తి, పార్టీ.
అందుకనే మొన్న పార్టీని తమిళ ప్రజలారా! నేను పార్టీ పెట్టనందుకు నన్ను క్షమించండితో ప్రారంభించారు. మిమ్మల్ని ఎప్పటికీ క్షమిస్తాము. విూరు రాజకీయాలకు పనికిరారు.
- డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు, (‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత)
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/