ప్రాంతీయ భాషల్లో తెలుగుకు పెద్దపీట

నేడు మాతృభాషా దినోత్సవం

telugu letters
telugu letters

భాష మన ఉనికిని తెలియచేస్తుంది. మన ప్రాంతాన్ని చెబుతుంది. మన సంస్కృతిని ప్రభావితం చేస్తుంది. మనకొక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.

భావ వ్యక్తీక రణకు మార్గదర్శిగా నిలు స్తుంది. ఏ భాషకైనా తొలి గురువు అమ్మే.

అమ్మ పొత్తిళ్ల నుంచే మనం భాషను నేర్చు కుంటాం. అందుకే మనం మాట్లాడే భాషను మాతృభాష అంటాం.

తెలుగు ప్రాంతంలో నివసించే మనభాష తెలుగు. ఇదెంతో మధురమైనది.ఆ మాధుర్యాన్ని ఎక్కడికి వెళ్లినా ఆస్వాదిస్తూ ఉండాలి. జీవనోపాధి కోసం ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మాత్రం మరువకూడదు.

‘తెలుగు భాష తీయదనం… తెలుగు భాష గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక తీయదనం అని కవి తెలుగు గొప్పద నాన్ని చాలా చక్కగా వివరించడం జరి గింది.

ప్రపంచ భాషలన్నింటిలో తెలుగు భాషకు ఒక విశి ష్టమైన స్థానం ఉంది. భారతదేశంలోని ప్రాంతీయ భాషలన్నింటిలోకి తెలుగు జీవ భాష.

గిడుగు రామ్మూర్తి పంతు లు జయంతిని రాష్ట్ర ప్రజలు మాతృభాషా దినోత్సవంగా పాటిస్తున్నారు.

శిష్ట వ్యావహారికం పేరిట వాడుకభాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు.

తెలుగు భాషా బోధ నను వ్యావహారికంలో చేయాలన్న ఆయన ఆలోచనకు 1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చి న జె.ఎ.యేట్స్‌ అనే ఆంగ్లేయుడి నుంచి మద్దతు లభించింది.

అప్పటి నుంచి స్కూలు, కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యావ హారిక భాషలో వెలువడడం మొదలుపెట్టాయి.

తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతి ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

భారతదేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 95 కోట్ల జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటిస్థానంలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 18 కోట్లమంది మాట్లాడే భాష!

కర్ణాటక, తమిళ నాడు, కేరళ,గుజరాత్‌,ఢిల్లీ, ఒడిశా,బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలోనే కాక, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌,ఫ్రాన్సు, శ్రీలంక, థాయిలాండ్‌, బ్యాంకాక్‌ లాంటి అనేక దేశాలలో తెలుగు వారు నివసిస్తున్నారు.

అమ్మభాష కమ్మదనంపై నేటికీ ఎంతోమంది కవులు, రచయితలు కీర్తిస్తూనే ఉన్నారు.ఎంత గొప్పగా చెప్పినా ఎప్పటికీ తనివి తీరనిది మన తెలుగుభాష గొప్పదనం.

తెలుగు భాష గొప్పదనాన్ని తెలుగు వారైనా మనం కీర్తించడం కాదు ఎందరో ఇతర భాషా మేధావులు కూడా ప్రస్తుతించారు.

కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయులు తెలుగు భాషను ‘దేశ భాషలందు తెలుగు లెస్స అని వ్యవహరించారు. తెలుగు అక్షరమాల కన్నడ భాష లిపిని పోలియుంటుంది.

తెలుగు భాషలోని చాలా పదాలు, పద శబ్దాలు చాలా ఆహ్లాదంగా, మనసుకు హాయిగా ఉంటాయి. అందకే ఆయన తెలుగుని ఆ విధంగా వర్ణించారు. వెనీసుకు చెందిన వర్తకుడు నికోల §్‌ుకోంటి ఇటాలియన్‌ భాషావేత్త.

1420లో మన దేశాన్ని సందర్శించి న ఆ ఇటాలియన్‌ యాత్రికుడు దేశంలోని ప్రధాన భాషల న్నింటినీ పరిశీలించి చివరికి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి తెలుగుభాషపై పరిశోధన జరిపి మా ఇటాలి యన్‌ భాషవలే తెలుగు కూడా అజంతమైనది.

పదాల ఉచ్ఛారణ శబ్దసౌందర్యం భావవిస్తృతికి గల అవకాశం ఏ పదాన్ని ఉచ్చరించినా దాన్ని శబ్దంతోసహా పొల్లుపోకుండా రాయడానికి వీలైన లిపి భారతదేశ భాషలందు తెలుగు ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అని ఉద్భోదించారు.

అందుకే తెలుగు భాష గొప్పతనాన్నివర్ణించడం అక్షరాలకు అందనిది.

ఇక సి.పి బ్రౌన్‌ బిషప్‌ కాల్డ్వెల్‌, జె.పి.ఎల్‌. గ్విన్‌ వంటి బ్రిటిష్‌ ప్రముఖులు తెలుగు భాషకు చేసిన చిరస్మరణీయ సేవలను ప్రతీ తెలుగువారు తమ జీవితపర్యంతం గుర్తు పెట్టుకుంటారు.

ప్రాచీనహోదా కలిగి, వందల ఏళ్ల వయసు కలిగి ఉన్న తెలుగుభాషా పాలకుల నిర్లిప్తత వల్లనైతేనేమి, ప్రజల భాగస్వామ్యం లేకపోవడం వల్లనైతేనేమి కొంత నిర్ల క్ష్యానికి గురవుతున్నది.

ఒకరిద్దరూ ముఖ్యమంత్రులు తప్ప తెలుగుభాషను ప్రోత్సహించడానికి ఏ ముఖ్యమంత్రి చొరవ తీసుకోకపోవడం తెలుగువారి దురదృష్టకరం.

విభజనాంతరం కూడా ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రభుత్వాలు మాతృభాష పట్ల ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నాయి.

ఏలికలు మేల్కొని తేనెలొలుకు తేట తెలుగును రక్షించుకోకపోతే కొవ్వొత్తిలా కరిగిపోతుంది.తెలుగు భాష దినదినాభివృద్ధి చెందాలంటే సాహిత్యం అత్యుత్తమ స్థాయిలో రాణించాలి.

  • కాళంరాజు వేణుగోపాల్‌

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/