అర్థరాత్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లిన సీఎం స్టాలిన్

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఏం చేసినా విభిన్నంగా ఉంటోంది. వినూత్న నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న ఆయన మరోసారి సంచలనం రేపారు. అర్థరాత్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసులకు సంబదించిన వివరాలు అడిగితెలుసుకున్నారు. మాములుగా అయితే పోలీస్ స్టేషన్ లకు అర్ధరాత్రి పూట డిపార్ట్‌మెంట్‌ల అధికారులు మరి అవసరమైతే… జిల్లా ఎస్పీలు వెళ్లి తనిఖీలు చేయడం చేస్తారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సడెన్ గా వెళ్లి వివరాలు అడగడం ఒక్క స్టాలిన్ కే దక్కింది.

స్టాలిన్ బుధువారం ఆర్ధరాత్రి సమయంలో సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న సమయంలో అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. లోపలికి వెళ్లి పోలీసు స్టేషన్ నిర్మాణానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీఎస్‌ను ఎప్పుడు నిర్మించారు.. పోలీసు స్టేషన్‌ను ఎప్పుడు ప్రారంభించారు లాంటి వివరాలను తెలుసుకున్న స్టాలిన్…. పీఎస్‌లో నమోదైన కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. దీంతో స్టాలిన్ పనితీరుపై సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రంశంసలు అందుకుంటున్నారు.

இரவும் பகலும் காவல் காத்து சட்டம் – ஒழுங்கை நிலைநிறுத்திடும் மகத்தான பணி காவல்துறையினருடையது!

அதியமான்கோட்டை காவல்நிலையத்தில் திடீர் ஆய்வு மேற்கொண்டு, பொதுமக்கள் அளித்துள்ள புகார்கள் மீதான நடவடிக்கைகள் குறித்து கேட்டறிந்தேன்.

வள்ளுவர் வாக்கின்படி முறைசெய்து காப்பாற்றுவோம்! pic.twitter.com/mGttKYTX9v
— M.K.Stalin (@mkstalin) September 29, 2021