పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ కీలక సమావేశం

న్యూఢిల్లీ : నేడు ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు , ఆయా రాష్ట్రాల ఇంఛార్జ్ లతో కీలక సమావేశమ‌య్యారు. ఈ సమావేశానికి వేణుగోపాల్ అధ్యక్షత వహించారు. అయితే ఈ స‌మావేశానికి సోనియా గాంధీకి బ‌దులుగా ప్రియాంక హాజ‌ర‌య్యారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో అంతర్మధనం మొదలైంది. పార్టీలో సంస్థాగత మార్పులు అవసరమని భావించిన పార్టీ అధిష్టానం ఆదిశగా చర్యలు చేపట్టింది. ఈక్రమంలో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలపై ఈరోజు పార్టీ కీలక నేతలు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమిని విశ్లేషించుకుంటూ ఇటీవల పార్టీ అధినేత్రి సోనియాను కలిసిన జి-23 నేతల బృందం పలు సూచనలు చేసిన విష‌యం విధిత‌మే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/