లోకేష్ తొందరపాటు..ఆయన్ను ట్రోల్ కు గురిచేస్తుంది

లోకేష్ తొందరపాటు..ఆయన్ను ట్రోల్ కు గురిచేస్తుంది

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకరావాలని నారా లోకేష్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. గతంలో జనాల మధ్య కు వచ్చేవారు కాదు..కానీ జనాల మధ్య తిరిగితేనే నాయకుడు అనిపించుకుంటాడని కాస్త లేటుగా తెలుసుకున్న లోకేష్..ఈ మధ్య ఎక్కువగా జనాల్లో కనిపిస్తున్నాడు. అలాగే సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటున్నాడు. అయితే యాక్టివ్ గా ఉండడం వరకు ఓకే కానీ వైసీపీ సర్కార్ ఫై విమర్శలే చేయడమే పనిగా పెట్టుకోవడం..నిజ నిజాలు తెలుసుకోకుండా జగన్ ప్రభుత్వం ఫై విమర్శలు చేయడం ఆయన్ను ట్రోల్ కు గురిచేస్తున్నాయి.

తాజాగా జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ..ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి విష్ణు అనే బాలుడు చనిపోయి ఘటనే. ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి విష్ణు చనిపోయాడు..దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్షమే అని విమర్శలు చేసారు. నిజానికి బాలుడు శిథిలావస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్ వద్దకు వెళ్లి ఆడుతున్న క్రమంలో అది కూలి చనిపోయాడు. కానీ, సదరు బాలుడు చదువుతున్న పాఠశాల ప్రభుత్వ పాఠశాల కాదనీ, ప్రైవేటు పాఠశాల అని తాజాగా తెలిసింది. దీంతో లోకేశ్ తీరును తప్పుబడుతూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ప్రతీ దానికి లోకేశ్ వైసీపీ ప్రభుత్వం వల్లే అనడం మానుకోవాలని సూచిస్తున్నారు.