బిగ్ బాస్ 5 : హౌస్ లో ఫస్ట్ అడుగుపెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్‌ ఎవరో తెలుసా..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 అట్టహాసంగా మొదలైంది. మిస్టర్ మజ్ను సాంగ్‌తో కింగ్ నాగార్జున స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. స్టేజ్ మీదికి నాగార్జునని ఆహ్వానిస్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు బిగ్ బాస్. బిగ్ బాస్ వాయిస్ తో స్టేజ్ అదిరిపోయింది. ఇక బిగ్ బాస్ హౌస్ గురించి చెప్పుకొచ్చారు నాగ్. వాష్ రూం, మోజ్ రూం, సోఫాలు , కిచెన్‌, పవర్ రూం అంటూ కొత్త దాన్ని పరిచయం చేశారు.

పవర్ వస్తే.. బాధ్యతలు కూడా వస్తాయి.. దాన్ని సక్రమంగా వాడాల్సి ఉంటుందని నాగ్ హింట్ ఇచ్చారు. ఆ తర్వాత బెడ్రూం, కన్ఫెషన్ రూం ఇలా హౌస్ లో ఉన్నవన్నీ ప్రేక్షకులకు చూపించారు. ఫస్ట్ కంటెస్టెంట్‌గా సీరియల్ నటి.. సోషల్ మీడియా సెలబ్రిటీ సిరి హనుమంత్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బూమ్ బద్దలు అంటూ కిక్ ఇచ్చే సాంగ్ తో స్టేజ్ ఫై తన అందంతో పాటు డాన్సుతో కట్టిపడేసింది. ఇక సెకండ్ కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు విజె సన్నీ , మూడో కంటెస్టెంట్‌గా లహరిహౌస్ లో ఎంట్రీ ఇచ్చారు. మొత్తం మీద బిగ్ బాస్ 5 అంతకు మించి అనే మాదిరిగా ఉండబోతుందని అర్ధమవుతుంది.