జగన్ నిజంగానే సైకో రెడ్డి అనిపించుకున్నాడు – నారా లోకేష్

జగన్ నిజంగానే సైకో రెడ్డి అనిపించుకున్నాడు - నారా లోకేష్

వైసీపీ నేతలు , కార్య కర్తలు తెలుగుదేశం కార్యాలయాల ఫై దాడులు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వైసీపీ దాడికి నిరసనగా ఈరోజు రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపు నిచ్చింది. అలాగే రేపటి నుండి 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ దాడుల పట్ల వైసీపీ , టీడీపీ నేతలు ఒకటి ఫై ఒకరు దూషణలు చేసుకుంటున్నారు.

ఈ వ్యవహారం ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్..ముఖ్యమంత్రి జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో జగన్ నిజంగానే సైకో రెడ్డి అనిపించుకున్నారని ఆయన విమర్శించారు. పెంపుడు కుక్కలను తమపైకి పంపి తాడేపల్లి ఇంటిలో దాక్కున్న వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. ప్రత్యక్షంగా వస్తే మాట్లాడదామని, పోరాడదామని లోకేశ్ సవాల్ విసిరారు. ఎవరూ లేని సమయంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే భయపడతామనుకుంటున్నారా అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రతిపక్షం అడిగే ప్రశ్నకు దమ్ముంటే సమాధానం చెప్పాలి. లేనిపక్షంలో ఇంటికే పరిమితం కావాలి. ఏపీలో ఎప్పుడూ లేని విధంగా డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగింపోయింది.’’ అని లోకేశ్ ఆరోపించారు.