నారా లోకేష్ మూడోవ రోజు పాదయాత్ర షెడ్యూల్

నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కుప్పం లో మొదలైన యాత్ర ..ఈరోజు తో రెండు రోజులు పూర్తి చేసుకుంది. మొదటి రోజు 8.5 కిలోమీటర్లు, రెండో రోజు శాంతిపురం మండలంలో 9.3 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర సాగింది. ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైంది.

కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ నుంచి యాత్రను ప్రారంభించారు. గుడుపల్లె మండలం, బెగ్గిపల్లె గ్రామస్థులతో లోకేష్‌ సమావేశం అయ్యారు. మధ్యాహ్నం కనుమలదొడ్డిలో భోజన విరామం తీసుకుని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పలమనేరు-కుప్పం హైవే పక్కన ఈరోజు రాత్రి లోకేష్.. బస చేయనున్నారు. ఇక రేపు మూడోరోజు పాదయాత్రకు సంబదించిన షెడ్యూల్ ను పార్టీ విడుదల చేసింది.

8.00 AM – శాంతిపురం క్యాంప్ సైట్ నుంచి 3వరోజు యాత్ర ప్రారంభం

8.45 AM – ప్రముఖులతో సమావేశం

9.45 AM – బడుమాకళ్లపల్లెలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం

12.15 PM – కె.గెట్టపల్లి జంక్షన్‌లో స్థానికులతో మాటమంతీ

12.45 PM – కె.గెట్టపల్లిలో భోజన విరామం

3.00 PM – కె.గెట్టపల్లి జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు

5.00 PM – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్‌కు చేరిక.. ప్రముఖులతో సమావేశం

5.55 PM – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్‌లో 3వరోజు పాదయాత్రకు విరామం ఇచ్చి బస చేయనున్నారని తెలిపింది. ఇక లోకేష్ యాత్ర కు ప్రజలు , కార్యకర్తలు బ్రహ్మ రథం పడుతున్నారు. మరోపక్క పాదయాత్ర నేపథ్యంలో పార్టీ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. 500 మంది పార్టీ వలంటీర్లను, 200 మంది బౌన్సర్లను నియమించింది.