పవన్ను నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నట్లు వర్మ కు దేవుడు చెప్పాడట

నిత్యం వివాదాస్పద కామెంట్స్ , ట్వీట్స్ తో టైం పాస్ చేసుకొనే వర్మ..ఇటీవల ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఏంచేసినా దానిపై వెటకారంగా స్పందిస్తూ జనసేన కార్య కర్తల్లో , మెగా అభిమానుల్లో ఆగ్రహం పెంచుతూ వస్తున్నారు. మొన్నటికి మొన్న వారాహి వాహనం ఫై పవన్ కామెంట్స్ చేయగా..తాజాగా నాదెండ్ల మనోహర్ , చంద్రబాబు లు కలిసి పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడవబోతున్నారని , ఈ విషయాన్నీ రాత్రి కలలో దేవుడు చెప్పాడంటూ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు.

ఆనాడు జూలియస్ సీజర్‌ను బ్రూటస్, ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్‌ని నాదెండ్ల భాస్కర్ రావు, అటు పిమ్మట మళ్లీ ఎన్టీఆర్‌నే నారా చంద్రబాబు నాయుడు ఎలా అయితే వెన్నుపోటు పొడిచారో.. ఇప్పుడు కూడా జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కూడా ఆయన పక్కనే ఉంటున్న నాందెండ్ల మనోహర్, నారా చంద్రబాబు నాయుడు.. ఇద్దరు కలిసి వెన్నుపోటు పొడుస్తారని జోస్యం చెప్తున్నాడు ఆర్జీవి. ఈ విషయాన్ని తనకు రాత్రి పూట కలలో ఏకంగా దేవుడే కనిపించి చెప్పాడట. ఈ మేరకు వర్మ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఫై జనసేన కార్య కర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిప్లయ్ ఇస్తున్నారు.