గోవా సిఎం ప్రమోద్‌ సావంత్‌కు కరోనా

Goa Chief Minister Pramod Sawant

పనాజీ: గోవా సిఎం ప్రమోద్‌ సావంత్‌ కరోనా సోకింది. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని తెలిపారు. క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు అని చెప్పారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉంటున్న‌ట్లు సిఎం పేర్కొన్నారు. ఇంటి నుంచే త‌న కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తాన‌ని తెలిపారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సిఎం సావంత్ విజ్ఞ‌ప్తి చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/