చంద్రబాబు, పవన్ కు మోడీ కేసీఆర్, రేవంత్ అభినందనలు

ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ లకు ప్రధాని మోడీ, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ‘ప్రజలు వరుసగా మూడోసారి ఎన్డీయేపై విశ్వాసం ఉంచారు.

భారతదేశ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి గత దశాబ్దంలో చేసిన మంచి పనిని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నా. ఈ విజయం కోసం ఎంతో కృషి చేసిన కార్యకర్తలందరికీ నేను సెల్యూట్ చేస్తున్నా. వారిని అభినందించేందుకు మాటలు చాలవు’ అని మోదీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వీరికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి..’ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథం వైపు సాగుదాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.