కంటోన్మెంట్ బిజెపి అభ్య‌ర్ధిగా తిల‌క్

bjp

లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో బిజెపి పార్టీ 12వ జాబితాను విడుదల చేసింది. మొత్తం నాలుగు రాష్ట్రాల‌కు చెందిన 7 లోక్ స‌భ స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించింది.. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌ల‌లో పోటికి టి ఎన్ వంశ తిల‌క్ ను ఎంపిక చేసింది. అలాగే ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం నుంచి అభిజిత్ దాస్ అభ్యర్థిగా ప్రకటించింది.

దీంతో పాటు యూపీలోని రెండు స్థానాల నుంచి అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఫిరోజాబాద్ నుంచి ఠాకూర్ విశ్వజిత్ సింగ్ బరిలోకి దిగనున్నారు. ఇది కాకుండా శశాంక్ మణి త్రిపాఠికి డియోరియా స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు.