యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫ‌లితాలు విడుద‌ల‌

UPSC Civils 2023 Result Release

న్యూఢిల్లీః యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ సివిల్స్ 2023 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. పాల‌మూరు అమ్మాయి దోనూరి అన‌న్య రెడ్డికి మూడో ర్యాంకు వ‌చ్చింది. ఆదిత్య శ్రీవాత్స‌వ‌కు తొలి ర్యాంకు రాగా, రెండో ర్యాంకు అనిమేష్ ప్ర‌దాన్, దోనూరి అన‌న్య రెడ్డికి మూడో ర్యాంకు వచ్చింది. నాలుగో ర్యాంకు పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్, ఐదో ర్యాంకు రుహ‌నీకి వ‌చ్చింది.

జ‌న‌ర‌ల్ కేట‌గిరి కింద 347, ఈడ‌బ్ల్యూఎస్ కింద 115, ఓబీసీ కింద 303, ఎస్సీ కేట‌గిరి కింద 165, ఎస్టీ కేట‌గిరి కింద 86 మందిని ఎంపిక చేశారు. 180 మంది ఐఏఎస్ పోస్టుల‌కు, 37 మంది ఐఎఫ్ఎస్ పోస్టుల‌కు, 200 మంది ఐపీఎస్ పోస్టుల‌కు, 613 మంది సెంట్ర‌ల్ స‌ర్వీసెస్ గ్రూప్ ఏ పోస్టుల‌కు, 113 మంది గ్రూప్ బీ స‌ర్వీసుల‌కు ఎంపిక‌య్యారు.

సీఎస్‌బీ ఐఏఎస్ అకాడ‌మీ నుంచి 16 మంది ఎంపిక‌య్యారు. మెరుగు కౌషిక్ 82, పెంకేసు ధీర‌జ్ రెడ్డి 173, భానుశ్రీ 198, హ‌రిప్ర‌సాద్ రాజు 475, కే శ్రీనివాసులు 526, కిర‌ణ్ సాయింపు 568, మ‌ర్రిపాటి నాగ‌భ‌ర‌త్ 580, ఐశ్వ‌ర్య నీలిశ్యామ‌ల 649, రాజ్ కుమార్ చౌహాన్ 703, ఆదా సందీప్ కుమార్ 830, జే రాహుల్ 873, హ‌నిత వేముల‌పాటి 887, కే శ‌శికాంత్ 891, కెసార‌పు మీన 899, రావూరి సాయి అలేఖ్య 938, గోవ‌ద న‌వ్య‌శ్రీకి 995 ర్యాంకు వ‌చ్చింది.