బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత

బిఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుస పెట్టి నేతలు పార్టీని వీడుతూ వస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలలో చేరగా..తాజాగా మరో కీలక నేత టి. సోమన్‌ రాజీనామా చేసారు.

మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పదేళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నానని, శాసనసభ ఎన్నికల్లో ముఠా గోపాల్‌ గెలుపునకు, పార్టీ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్‌ కేటాయింపులో తనకు అన్యాయం చేశారని ఆయన అన్నారు. ఇలా వరుస అవమాలు తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.