విప‌క్షాల ఆందోళన..ఉభ‌య‌స‌భ‌లు రెండు గంట‌ల వ‌ర‌కు వాయిదా

lok sabha-and-rajya-sabha-adjourned-up to-2-pm-today

న్యూఢిల్లీః లోక్‌స‌భలో ఈరోజు విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. అదానీ-హిండెన్‌బ‌ర్గ్ అంశంపై జేపీసీతో ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని విప‌క్ష స‌భ్యులు డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. దీంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. మ‌రో వైపు మంత్రి పీయూష్ గోయ‌ల్ మాట్లాడుతూ.. భార‌త్ గురించి విదేశీ గ‌డ్డ‌పై రాహుల్ అనుచితంగా మాట్లాడార‌ని, ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కానీ విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న‌లు విర‌మించ‌క‌పోవ‌డంతో.. స్పీక‌ర్ బిర్లా స‌భ‌ను మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

మరోవైపు రాజ్య‌స‌భ లోనూ విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ స‌భ‌ను 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.