కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

కర్ణాటక : కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. దినసరి కూలీలతో వెళ్తున్న జీపు చింతామణి సమీపంలోని మరనాయకహళ్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మృతిచెందారని, వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. వారంతా కూలీలని, పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని వెల్లడించారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/