‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ నుండి మరో లిరికల్ సాంగ్ రిలీజ్

నాగ శౌర్య – మాళవిక నాయర్ జంటగా అవసర శ్రీనివాస్ తెరకెక్కించిన మూవీ ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ . మార్చి 17 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలతో బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని పలు సాంగ్స్ రిలీజ్ చేయగా..బుధువారం మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు.

వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పాటకి కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా, బెన్ హుమన్ .. విష్ణుప్రియ రవి ఆలపించారు. యూత్ ను దృష్టిలో పెట్టుకుని కంపోజ్ చేసిన పెప్పీ నంబర్ ఇది. విశ్వప్రసాద్ – వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగశౌర్య ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరి ఆయనకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

YouTube video