తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు లాక్ డౌన్
హైదరాబాద్లో బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బంది

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రజలందరూ ఇళ్ళకే పరిమితం కావటంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. అయితే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపునిచ్చింది. దీంతో వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. నగరంలోని పలు మార్కెట్లు, దుకాణాల వద్ద జనం బారులు తీరారు. మరోవైపు హైదరాబాద్లో బస్సులు లేక ఇబ్బందిపడ్డారు.ఉదయం 10 గంటల తర్వాత దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/