ఇదే రోజు ‘తెలంగాణ బిల్లు’ ప్రవేశ పెట్టిందంటూ హరీష్ రావు ట్వీట్

‘తెలంగాణ బిల్లు’కు 9 ఏళ్లు అంటూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసారు. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో దార్శనికత కలిగిన నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించిన ప్రజా ఉద్యమం విజయం సాధించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. లోక్ సభలో తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందింది ఈ రోజేనని పేర్కొన్నారు. సంబరాల్లో భాగంగా నాడు కేసీఆర్ తో కలిసి దిగిన ఫొటోను ఆయన ట్వీట్ చేశారు.

‘‘9 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు చరిత్ర సృష్టించారు. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో దార్శనికత కలిగిన నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించిన ప్రజా ఉద్యమం విజయం సాధించింది’’ అని పేర్కొన్నారు.