మంత్రి ‘వెల్లంపల్లి’కి పితృవియోగం
వైసీపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం

Viajyawada: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ (80) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. సూర్యనారాయణ భౌతికకాయాన్ని సందర్శనార్థం మంత్రి నివాసం వద్ద ఉంచారు. విజయవాడ భవానీపురం పున్నమిఘాట్ వద్ద హిందూ స్మశానవాటికలో గురువారం సాయంత్రం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. కాగా మంత్రి వెల్లంపల్లికి పలువురు వైసీపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/