31 వరకు మహరాష్ట్రలో లాక్‌డౌన్ పొడిగింపు

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు

31 వరకు మహరాష్ట్రలో లాక్‌డౌన్ పొడిగింపు
Lockdown in Maharashtra

ముంబయి:  మహరాష్ట్రలో  కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్నది.  ఈ సందర్భంగా ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికంగా కరోనా కేసులు నమోదుకావడమే ఇందుకు కారణమని, వాటిని అదుపు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తేల్చిచెప్పింది. పూణే, ముంబై, సోలాపూర్, మాలేగావ్, ఔరంగాబాద్, నాసిక్, ధులే, జల్‌గావ్, అకోలా, అమరావతి, నాగ్‌పూర్‌లలో లాక్‌డౌన్‌ పొడిగించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ, లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ ప్రజల అవసరాల దృష్ట్యా మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. అయితే రెస్టారెంట్లు, సినిమా థియేటర్లకు మాత్రం అనుమతిలేదని ప్రకటించారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/