స్వదేశానికి చేరిన 114 మంది భారతీయులు

స్వదేశానికి చేరిన 114 మంది భారతీయులు
indians-brought-back-from-uae

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా యూఏఈలో చిక్కుకున్న 114 మంది భారతీయులు.. ఆదివారం రోజు స్వదేశానికి చేరుకున్నారు. 114 మందితో యూఏఈలో బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. మధ్యప్రదేశ్‌లోని దేవీ అహల్యాబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న సాయంత్రం ల్యాండ్ అయింది. కాగా.. యూఏఈ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరినీ క్వారెంటైన్ కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. కాగా కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం మే 7న ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 1 నుంచి ఐదో విడత ‘వందే భారత్ మిషన్’ ప్రారంభమైంది.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/