నేడు లాక్‌డౌన్‌ పొడిగింపు పై ప్రకటన?

రాష్ట్రాల సిఎంలతో మాట్లాడిన అమిత్‌షా

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ అంశంపై కేంద్ర హోమంత్రి అమిత్‌షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఈసందర్భంగా లాక్‌డౌన్‌ ‌ కొనసాగాల్సిందేనని మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమిత్‌షాకు చెప్పారు. ఈవిషయానే అమిత్‌ షా శుక్రవారం ప్రధాని నరేంద్రని కలిసి సంభాషణల సారాంశాన్ని వివరించారు. దీంతో.. మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ను పొడిగించే ప్రకటన శనివారం వెలువడే అవకాశం ఉంది. ప్రధాని, హోంమంత్రితో పాటు సమావేశంలో కేబినెట్‌ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా.. ముఖ్యమంత్రులతో హోంమంత్రి మాట్లాడటం ఇదే ప్రథమం. సాధారణ జీవనానికి ఒకేసారి కాకుండా క్రమక్రమంగా రావాలని పలువురు ముఖ్యమంత్రులు హోంమంత్రికి సూచించారు. ఏ ఏ వ్యాపార సంస్థలు తెరవాలో నిర్ణయించుకునే వెసులుబాటు మాత్రం రాష్ట్రాలకు ఉండటం గమనార్హం. కాగా దేశంలోని 30 పట్టణ ప్రాంతాల నుంచే 80 శాతం కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెప్పింది. రెడ్‌జోన్‌లో ఉన్న 30 పట్టణ ప్రాంతాల విషయంలో కఠినంగానే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. జూన్‌ ఒకటి తర్వాత కరోనా నిబంధనల విషయంలో కేంద్రం పరిమిత పాత్ర మాత్రమే పోషిస్తుందని, రాష్ట్రాలే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/