ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ap-inter-exams

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు. మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 14 వరకూ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరపనున్నారు. ఏప్రిల్ నుంచి మే రెండో వారం వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల టైమ్ టేబుల్ ను సోమవారం ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల టైమ్ టేబుల్

మార్చ్ 15 సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 17 ఇంగ్లీషు
మార్చ్ 20 గణితం పేపర్ 1ఏ, బోటనీ, సివిక్స్
మార్చ్ 23 గణితం పేపర్ 1బి, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 25 ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 28 కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మార్చ్ 31 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు, ఎంబైపీసి మేధ్స్
ఏప్రిల్ 3 మోడర్న్ లాంగ్వేజ్, జియాగ్రఫీ

ఇంటర్ సెకండ్ ఇయర్ టైం టేబుల్ :

మార్చ్ 16 సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 18 ఇంగ్లీషు
మార్చ్ 21 మేధ్స్ పేపర్ 2ఏ, బోటనీ, సివిక్స్
మార్చ్ 24 మేధ్స్ పేపర్ 2బి, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 27 ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 29 కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
ఏప్రిల్ 1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు, ఎంబైపీసీ మేధ్స్
ఏప్రిల్ 4 మోడర్న్ లాంగ్వేజ్, జియాగ్రఫీ.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. కాగా, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.

ప్రాక్టికల్ పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి 25వ తేదీ వరకు… ఏప్రిల్ 30 నుంచి మే 10వ తేదీ వరకు రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.