ప్రభుత్వ ఏడాది పాలనపై విమర్శలు

జాతీయ స్థాయిలో తుగ్లక్ ప్రభుత్వమంటూ వచ్చిన బిరుదులు

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్‌ వైఎస్‌ఆర్‌సిపి ఏడది పాలనపై విమర్శలు గుప్పించారు. ‘వైఎస్ జగన్ గారి ఏడాది పాలన గురించి చెప్పాలంటే 65 కోర్టు మొట్టికాయలు, రాజ్యాంగ అతిక్రమణలు, కోర్టు ధిక్కారాలు, జాతీయ స్థాయిలో తుగ్లక్ ప్రభుత్వం, తీవ్రవాద ప్రభుత్వం అంటూ వచ్చిన బిరుదులు, భూకబ్జాలు, స్కాములు, మంత్రుల బూతులు, భజనలు, దౌర్జన్యాలు అని చెప్పుకోవాలి’ అని విమర్శించారు. ‘ఇక ప్రజల బాగు విషయానికి వస్తే 60 మంది నిర్మాణరంగ కార్మికులు, 65 మంది రాజధాని రైతులు, 750 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు.160 రోజులుగా అమరావతి కోసం మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం కొనసాగుతూనే ఉంది. గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు’ అని చెప్పారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/