హుజురాబాద్ ఉప ఎన్నిక : కండువాలు మార్చుకుంటున్న బిజెపి , తెరాస నేతలు

హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో బిజెపి , తెరాస నేతలు తమ ప్రచారాన్ని స్పీడ్ చేసారు. అయితే ఇరు పార్టీల నేతలకు వరుస షాకులు తగులుతున్నాయి. బిజెపి నేతలు..తెరాస లోకి, తెరాస పార్టీ నేతలు బిజెపి లోకి జంపింగ్ చేస్తూ..నేతలను ఖంగారు పెడుతున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ లోకి జంప్ అవుతారో అని అంత జాగ్రత్త పడుతున్నారు.

హుజూరాబాద్‌కి చెందిన బీజేపీ కౌన్సలిర్ ఉమా మహేశ్వర రావు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో కమలం పార్టీని విడి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలతో కలసి పార్టీలో చేరారు. ఈ సందర్భాంగా మంత్రి గంగుల వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరి చేరిక తో అంత సంబరాలు చేసుకున్నారు. అయితే ఇలా బిజెపి కి షాక్ ఇచ్చామని అనుకునేలోపు టీఆర్‌ఎస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు బీజేపీలోకి వెళ్లి షాక్ ఇచ్చారు.

జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సురేందర్ రాజు, పలువురు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, మహిళలను బీజేపీలోకి చేర్చుకున్నారు. వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈటెల. ఇలా రెండు పార్టీల నేతలు కండువాలు మార్చుకుండడంతో ఎవరు ఎప్పుడు ఏ పార్టీ లో ఉన్నారో చెప్పలేకపోతున్నామని పార్టీ నేతలు అంటున్నారు.