సమంత పచ్చబొట్టు ఉంచుకుందా..తీసేసిందా..?

విడాకులు ప్రకటించిన సమంత..తన చేతిపై, నడుము ఫై ఉన్న పచ్చబొట్టు ఉంచుకుందా..తీసేసిందా.. ?ఇప్పుడు దీని గురించే అంత మాట్లాడుకుంటున్నారు. ఐదేళ్ల వివాహ బంధానికి నాగ చైతన్య – సమంతలు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏ విబేధాలు వచ్చాయో తెలియదు కానీ సోషల్ మీడియా లో మాత్రం అనేక కథనాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించి ఎవరి ఆలోచనలో వారు ఉన్నారు. ఇప్పటికే సమంత తన పేరుకు ముందున్న అక్కినేని ని మార్చుకొని సింగిల్ సమంత గా పెట్టుకుంది.

మరి పేరు మార్చుకున్న సమంత..తన చేతి ఫై , అలాగే నడుము ఫై చైతు కు సంబందించిన పచ్చ బుట్టు ను తీసేసిందా..అలాగే ఉంచుకుందా అని మాట్లాడుకుంటున్నారు. సమంత చేతిపై మాదిరిగా నాగచైతన్య చేతిపై కూడా టాటూ కనిపిస్తుంది. తాము ఇద్దరం ఒకటే అన్న భావన వచ్చేందుకు ఇద్దరూ సేమ్ టాటూ వేసుకున్నట్టు గతం లో ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే నాగచైతన్య సంతకాన్ని సమంత తన నడుము పై పచ్చబొట్టు లా వేసుకుంది. అప్పట్లో దీనికి సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు సమంత నడుము పై న ఆ పచ్చబొట్టు ఉందా లేదా అన్న చర్చ మొదలైంది.