‘ మహా న్యూస్ ‘ ఛానల్ ను చరణ్ కొనుగోలు చేస్తున్నాడా..? అసలు క్లారిటీ ఇదే..

బాబాయ్ కోసం రామ్ చరణ్ ఓ న్యూస్ ఛానల్ కొనుగోలు చేయబోతున్నాడనే వార్తలు గత కొద్దీ రోజులుగా మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో రాణించాలంటే వారికంటూ ఓ న్యూస్ ఛానల్ , న్యూస్ పేపర్ లేదా సపోర్ట్ చేసే చానెల్స్ ఉండాలి. అప్పుడే ఆ పార్టీ జనాల్లోకి బాగా వెళ్తుంది. వారు చేసే ప్రతి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిపై ప్రజల్లో నమ్మకం కలగజేయడం లో న్యూస్ ఛానల్ కానీ పేపర్ కానీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతి పార్టీ వారు తమకంటూ కొన్ని చానెల్స్ ను ఎంపిక చేసుకొని పెట్టుకుంటారు.

ఈ క్రమంలో బాబాయ్ పార్టీ కోసం చరణ్ ముందుకొచ్చారని..అందులో భాగంగా మహా న్యూస్ ఛానల్ ను చరణ్ కొనుగోలు చేయబోతున్నాడనే వార్తలు రావడం తో అంత నిజమే కావొచ్చని అనుకోవడం మొదలుపెట్టారు. అయితే దీనిపై మహాన్యూస్ ఎండీ వంశీకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ‘గత కొంతకాలంగా మహా న్యూస్ ఛానల్‌ని రామ్ చరణ్ కొన్నారనే ప్రచారం నడుస్తుంది. ఈ ఛానల్‌తో పాటు మరో మూడు నాలుగు ఛానల్‌ని పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ కొనుగోలు చేస్తున్నారు.. అని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి.

దీనికి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్‌గా ‘మహాన్యూస్’ కుటుంబ సభ్యులకు.. ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే.. నేను ఇప్పటి వరకూ ఈ విషయంపై రామ్ చరణ్‌తో మాట్లాడలేదు. రామ్ చరణ్ నాతో మాట్లాడలేదు. మా మధ్య మహాన్యూస్ ఛానల్‌కి సంబంధించి ఎటువంటి చర్చలు.. కొనుగోలు, అమ్మకాలకి సంబంధించిన చర్చలు జరగలేదు. సోషల్ మీడియాలో వచ్చేవి అన్నీ అవాస్తవాలు.. ప్రచారాలు మాత్రమే. మహాన్యూస్ ప్రేక్షకులు ఎవ్వరూ వీటిని నమ్మెద్దు.. ఈ కథనాలు రాసేవాళ్లు మమ్మల్ని కోరితే.. క్లారిటీ ఇవ్వడానికి కూడా మేం రెడీగా ఉన్నాం. రామ్ చరణ్‌కి మాకు మధ్య ఎలాంటి డీల్ నడవలేదు.. అవన్నీ అవాస్తవాలు’ అంటూ క్లారిటీ ఇచ్చారు.