జార్ఖండ్లో లాక్డౌన్ పొడిగింపు
సెప్టెంబరు 30 వరకూ పొడిగింపు

రాంచీ: జార్ఖండ్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిఎం హేమంత్ సోరెన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలంతా లాక్డౌన్ నియమాలను పాటించాలని, మాస్కులు ధరించాలని హేమంత్ సోరెన్ విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 34,676 కరోనా కేసులు నమోదయ్యాయి. 378 మంది మృతిచెందారు. రాష్ట్రంలో 10,799 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 23,499 మంది చికిత్స తర్వాత కోలుకున్నారు. మరోవైపు హర్యానా ప్రభుత్వం వారాంతపు లాక్డౌన్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/