టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి యత్నం ..భారీగా పట్టుబడ్డ నగదు

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ లో అధికార పార్టీ vs బిజెపి గా మారింది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలని అన్ని ప్రధాన పార్టీలు విస్తృత ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో బిజెపి.. అధికార పార్టీ నేతలను కొనుగోలు చేసేందుకు భారీ ప్లాన్ చేయగా..దానిని పోలీసులు బట్టబయలు చేసారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వల వేస్తూ, వారితో బేరసారాలు నిర్వహిస్తుండగా పోలీసులు సడెన్ ఎంట్రీ ఇచ్చి బిగ్ షాక్ ఇచ్చారు.

పక్కా సమాచారంతోనే సైబరాబాద్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. రూ. 15 కోట్ల వరకు నగదు దొరికినట్లు తెలుస్తోంది. బేరసారాల్లో టీఆర్ఎస్‌ నేతలు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్హాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్న పీఠాధిపతి రామచంద్రభారతి, బీజేపీ నేత నందకుమార్, సింహయాజులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.