కరీంనగర్ లో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన

కరీంనగర్ లో రూ.1030 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేశారు. తొలుత మంత్రికి తిమ్మాపూర్ వద్ద ప్రజలు, పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంత్రి గంగుల కమలాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు
మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా అల్గునూర్ వంతెనకు చేరుకొని భగీరథ పైలాన్ ను మంత్రి ఆవిష్కరించారు. రూ. 410 కోట్ల రూపాయలతో చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మార్కెఫెడ్ మైదానంకు చేరుకొని మంత్రి గంగులతో కలసి 615 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల శిలా పలకలను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/