కేంద్రమంత్రి అమిత్ షా తో చిరు, చరణ్ భేటీ

కేంద్రమంత్రి అమిత్ షా తో మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఓ ఛానల్ కాంక్లేవ్‌కు హాజరయ్యేందుకు వచ్చిన వీరు హోటల్‌లో భేటీ అయ్యారు. RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన నేపథ్యంలో రామ్ చరణ్‌కు హోం మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. రామ్ చరణ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. కేంద్ర మంత్రిని చిరంజీవి శాలువాతో సత్కరించారు. సుమారు 15 నిమిషాల పాటు వీరి భేటీ కొనిసాగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలు గా తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో భారీ విజయం సాధించింది. టాక్ పరంగానే కాదు కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డ్స్ నెలకొల్పింది. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఏకంగా ఆస్కార్ దక్కించుకొని వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా సత్తా చాటింది. ఈ అవార్డు రావడం పట్ల యావత్ సినీ అభిమానులు , సినీ లవర్స్ మాత్రమే కాదు యావత్ ప్రజానీకం హర్షం వ్యక్తం చేసింది. మోడీ దగ్గరి నుండి రాజకీయ నేతలంతా ఆర్ఆర్ఆర్ టీం ను అభినందించారు. తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా సైతం చరణ్ ను శాలువా తో సత్కరించారు.