హైదరాబాద్ డీసీపీ కార్యాలయం ప్రాంగణంలో పిడుగుపాటు..

గురువారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అప్పటి వరకు తీవ్ర ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కాగా రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ రాజేంద్రనగర్ జోన్ డీసీపీ కార్యాలయం ప్రాంగణంలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు కాలిపోయింది. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీశారు. భయంతో కొందరు పరుగులు తీశారు.

జగద్గిరిగుట్ట, చింతల్‌, బాలానగర్‌, చంపాపేట్‌, సరూర్‌నగర్‌, చైతన్యపురిలో భారీ వర్షం పడింది. సైదాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వడగళ్లతో వర్షం కురవగా.. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్‌, బేగంపేట, చిలకలగూడ, మారేడుపల్లితో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే పలుప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. సిటీ కాలేజీ వెనుక వైపున రోడ్డులో చెట్టు కూలడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్‌ చేస్తున్నారు.

గత కొద్దీ రోజులుగా మార్నింగ్ 8 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వరకు తీవ్రమవుతున్నాయి. ఎండలు ఎక్కువవడంతో జనం కూడా బయటకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. సాయంత్రం కాగానే బయటకు వెళ్దామనుకునే సరికి వర్షాలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాలు జనాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.