అందరి కళ్లూ మీ వైపే..
జీవన వికాసం

కొందరి వైపు అందర కళ్లూ తిరిగిపోతాయి. అందుకు కారణం వారు అనుసరించే కొన్ని స్టయిల్ టిప్స్, దుస్తులు, అలంకరణ, హావబావాలు, బాడీ లాంగ్వేజ్ కనువిందు చేసేలా ఉండాలి.
అందుకోసం కొన్ని టిప్స్!
బాడీ టైప్ :
ఒకే రకం దుస్తులు అందరికీ నప్పవు. ఎవరికి వారు తమ బాడీ టైప్‌ను స్వయంగా తెలుసుకోవాలి. ఆ టైప్‌కి తగిన దుస్తులు, అలంకరణ అనుసరించాలి. ఇందుకోసం స్టయిలింగ్ స్పెషలిస్టుల సలహా తీసుకోవాలి.
మాటలు:
ఎదుటివారి మాటలను మధ్యలోనే అడ్డుకోకపోవడం, అవసరమైనంత మేరకు, తక్కువ పదాల్లో ఎక్కువ అర్థం పలికేలా మాట్లాడడం కూడా ఓ కలే! ఈ కళ మీద పట్టు సాధించాలి. ఎదుటివారి మాటలు శ్రద్ధగా వినడం, ఎప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. స్వరంలో సున్నితత్వం ఒలికించాలి.
బాడీ లాంగ్వేజ్:
ప్రతి కదలికలో హూందా తనం కనిపించేలా నడుచుకోవాలి. గబగబా, అతి నెమ్మది నడవడం లేదా కుంగిపోయి నడవడం సికాదు మాటలకు తగ్గట్టు చేతులను కదిలించడం, తలను పంకించడం,
కళ్లతో భావాలను ప్రకటించడం అలవర్చుకోవాలి.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/