పాలసీదారులకు ఎల్‌ఐసి హెచ్చరిక
ఎల్‌ఐసి పేరు చెప్పుకుని కొందరు మోసం చేసే ఛాన్స్!

ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) తాజాగా తన కస్టమర్లను హెచ్చరించింది. మోసపోవద్దంటూ అలర్ట్ చేసింది. కొంత మంది ఎల్‌ఐసి పేరు చెప్పుకొని మోసం చేసే ఛాన్స్ ఉందని కస్టమర్లను హెచ్చరించింది.
ఎల్‌ఐసి అధికారులు, ఎల్‌ఐసి ఏజెంట్లు, ఐఆర్‌డిఎఐ అధికా రులు, ఇసిఐ అధికారులు అంటూ చెప్పు కొని ఎల్‌ఐసి పాలసీదారులను మోసం చేయొచ్చని ఎల్‌ఐసి కస్టమర్లను హెచ్చరిం చింది. మోసపోవద్దని అలర్ట్ చేసింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఎల్‌ఐసీ పాలసీదారులకు వారి పాలసీకి సంబంధించిన బోనస్ సంబంధిత వివ రాలను ఫోన్‌కాల్స్ ద్వారా తెలియచేయదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎల్‌ఐసి పాలసీ దారులను ప్రస్తుత పాలసీలను మానుకోమని లేదంటే నిలిపివేయాలని కోరదని తెలియచేసింది. అంతేకాకుండా ఎల్‌ఐసి పలు సూచనలు కూడా చేసింది.
పాలసీకి సంబంధించిన వివరాలను ఎల్‌ఐసి వెబ్‌సైట్ లేదా దగ్గరిలోని ఎల్‌ఐసి బ్రాంచుకు వెళ్లి పాలసీ వివరాలను అప్‌డేట్ చేసుకో వచ్చు. ఇంకా ఎవరైనా మీకు ఎల్‌ఐసి నుంచి కాల్స్ చేస్తే వారితో మాట్లాడవద్దని ఎల్‌ఐసి తెలిపింది.
ఎవరైనా కాల్‌చేసి పాలసీని సరం డర్ చేయాని కోరితే లేదంటే అదనపు బోనస్ వంటివి అంది స్తామని తెలియ చేస్తే వీటిని నమ్మ వద్దని పేర్కొంది. మీ పాలసీ వివరాలను ఎవ్వరికీ తెలియ చేయవద్దని తెలిపింది. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చని పేర్కొంది.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/