పసిడి అమ్మకాల్లో 95 శాతం క్షీణత!

అక్షయ తృతీయకు ..ఆన్‌లైన్ విక్రయాలకు స్పందన కరవు

gold-silver-prices-rise-new-highs
gold-silver-prices-rise-new-highs

హైదరాబాద్‌: ఈసారి అక్షయ తృతీయపై కరోనా లాక్‌డైన్‌ ప్రభావం బాగానే పడింది. ఫలితంగా అమ్మకాలు దారుణంగా క్షీణించాయి. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు కిక్కిరిసిపోయే నగల దుకాణాలు ఈసారి లాక్‌డౌన్ కారణంగా మూతబడ్డాయి. దీంతో కొందరు నగల వ్యాపారులు మాత్రం డిజిటల్ పద్ధతిలో కొనుగోళ్లకు అవకాశం కల్పించినప్పటికీ స్పందన మాత్రం అంతంతమాత్రమేనని పరిశ్రమల సమాఖ్య తెలిపింది. కాగా గతేడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 95 శాతం అమ్మకాలు క్షీణించాయని, నామమాత్రంగా ఐదు శాతం మాత్రమే విక్రయాలు జరిగాయని వివరించింది. మరోవైపు, బంగారం ధరలు 52 శాతానికిపైగా పెరగడం కూడా అమ్మకాలు తగ్గడానికి మరో కారణమని పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/