600% వరకు లాభాలిచ్చిన స్టాక్స్‌ ఇవే..

మార్కెట్‌ వాచ్‌

BSE
BSE

ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది ఇన్వెస్టర్ల లాభాలు రోలర్‌ కోస్టర్‌ను తలపించాయని చెప్పవచ్చు. అనుకోని విధంగా కరోనా కారణంగా ఈ ఏడాది ప్రారం భంలో భారీగా పతనమయ్యాయి మార్కెట్లు.

అలాగే ఊహించని విధంగా ఏడాది ముగిసే సమయానికి మార్కెట్లు రివ్వున ఎగిశాయి. 2020లో పలు స్టాక్స్‌ భారీ లాభాలను అందించాయి.

2020 ఏడాది 200 శాతానికిపైగా లాభాలు అందించిన కొన్ని స్టాక్స్‌ ఉన్నాయి. 2019 చివరి నాటికి రూ.100 కోట్ల మార్కెట్‌ విలువ కలిగి ఉండి, రూ.25కు తక్కువ ట్రేడింగ్‌ అయిన షేర్లు ఇలా ఉన్నా యి.

అలోక్‌ ఇండస్ట్రీస్‌ 2020 కేలండర్‌ ఇయర్‌లో 602 శాతం పుంజుకుంది. డిసెంబరు 31, 2019న రూ.3.04గా ఉన్న ఈ స్టాక్‌ డిసెంబరు 29నాటికి రూ.21.30కి చేరుకుంది.

సుబెక్స్‌ స్టాక్‌ ఈ ఏడాది 403 శాతం పెరిగింది. డిసెంబరు 29, 2019న రూ.5.09గా ఉన్న ఈ స్టాక్‌ డిసెం బరు 24, 2020న రూ.29.70కి చేరుకుంది. కోర్దా కన్‌స్ట్రక్షన్స్‌ 2020 కేలండర్‌ ఇయర్‌లో 376 శాతం పెరిగింది. డిసెంబరు 31, 2019 న రూ.23.74గా ఉన్న ఈ స్టాక్‌ డిసెంబరు 24, 2020న రూ.113.10కి చేరుకుంది.

కెల్టాన్‌ టెక్‌ సొల్యూషన్స్‌ 2020 కేలండర్‌ ఇయర్‌లో 301శాతం పుంజుకుంది. డిసెంబరు 31, 2019న రూ.18.05గా ఉన్న ఈ స్టాక్‌ డిసెంబరు 29, 2020న రూ.72.04కి చేరుకుంది. సిజి పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూ షన్స్‌ స్టాక్‌ ఈ ఏడాది299 శాతం దూసుకెళ్లింది.

డిసెంబరు 31, 2019న రూ.10.82గా ఉన్న ఈ స్టాక్‌ డిసెంబరు 24, 2020న రూ.43.20 కి చేరుకుంది. రతన్‌ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్టాక్‌ 2020 కేలండర్‌ ఇయర్‌లో 253 శాతం పెరిగింది. డిసెంబరు 31,2019న రూ.1.87గా ఉన్న ఈ స్టాక్‌ డిసెంబరు 29, 2020న రూ.6.61కి చేరుకుంది.

మార్క్‌ శాన్స్‌ ఫార్మా స్టాక్‌ 2020 కేలం డర్‌ ఇయర్‌లో 58.05శాతం పెరిగింది. డిసెంబరు 31,2020న రూ.16.71గా ఉన్న ఈ స్టాక్‌ డిసెంబరు24, 2020న 58.05 రూపాయలకి చేరుకుంది. టాటా టెలీ సర్వీసెస్‌ ఈ ఏడాది 237 శాతం పెరిగింది.

డిసెంబరు 31, 2019న 2.25 రూపాయలుగా ఉన్న ఈ స్టాక్‌ డిసెంబరు 24, 2020న రూ.7.59కి చేరుకుంది. బాంబే రేయాన్‌ ఫ్యాషన్స్‌ 2020 కేలండర్‌ ఇయర్‌లో 220 శాతం పెరిగింది. డిసెంబరు 31,2019న రూ.4.20గా ఉన్న ఈ స్టాక్‌ డిసెంబరు 24,2020న రూ.6.16కి చేరుకుంది.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/