దేశ వ్యాప్తంగా అందరికీ కరోనా వ్యాక్సినేషన్ ఉచితం

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటన

Harsh Vardhan
Harsh Vardhan

New Delhi: కరోనా వ్యాక్సిన్ దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా అందజేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ రోజు ప్రకటించారు.

డ్రైరన్ సందర్భంగా ఆయన విలేకరుల అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. ఢిల్లీలో వ్యాక్సినేషన్ ఉచితంగా చేస్తారా అన్న ప్రశ్రకు ఆయన బదులిస్తూ ఒక్క ఢిల్లీలోనే కాదు…దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నామని  చెప్పారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/