మళ్లీ పెట్రోల్ ధర బాదుడు !

మే 4 నుంచి ఇప్పటిదాకా 35 సార్లు పెరిగిన ధరలు

Rising petrol prices again
Rising petrol prices again

New Delhi: దేశంలో పెట్రో ధరలు ఆదివారం మరోసారి పెరిగాయి. తాజాగా పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 20 పైసల వరకు పెరిగాయి. దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.51, డీజిల్‌ రూ.89.36కు చేరింది. ముంబై నగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.105.98, డీజిల్‌ రూ.96.91కు పెరిగింది. మే 4వ తర్వాత నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌ ధరలను చమురు కంపెనీలు 35 సార్లు పెరిగాయి. ఇప్పటి వరకు మొత్తం రూ.9.19 వరకు పెరిగింది. డీజిల్‌ రేట్లు 34 సార్లు పెరగ్గా.. రూ.8.57 వరకు పెరుగుదల నమోదైంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/