ప్రజావాక్కు

స్థానిక సమస్యలపై ప్రజాగళం

Voice of the people

కఠిన చర్యలు తీసుకోవాలి: -మా.శ్రీరాజు. పాల్వంచ

ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా భయం జనం వెన్నుల్లో వణుకు పుట్టిస్తుంది. ఏ చిన్నపాటి జ్వరం వచ్చినా, జలుబు చేసినా కరోనా వచ్చిందేమో అనే భయం ఇప్పుడు జనం గుండెల్లో బాగా నాటుకుపోయింది.

గవర్నమెంటు ఆస్పత్రికి వెళితే నమయం అవ్ఞతుందో లేదో అనే అనుమానంతో చాలా మంది ప్రైవేట్‌ ఆస్పత్రులవైపు పరుగులు తీస్తున్నారు.

ఇదే మంచి అవకాశంగా ఆదాయం కోసం అనవసరమైన టెస్టులు చేపిస్తూ, అడ్డగోలుగా మందులు రాస్తూ, వారిని ఆస్పత్రుల్లో ఉంచి లక్షలు గుంజుతూ అడ్డగోలుగా అమాయక జనాన్ని కొంతమంది ప్రైవేట్‌ వైద్యులు దారుణంగా దండుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.

అటువంటి వారిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గట్టి నిఘాపెట్టి, వారిపై కఠిన చర్య లు తీసుకొని అమాయక జనాన్ని ఆదుకోవాలి.

పార్టీలు మారుస్తున్న హీరోయిన్లు:-ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

సినిమా హీరోయిన్లు ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరటం ఆ తరువాత కొన్నాళ్లకే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి మరో పార్టీలోకి జంప్‌ అవటమనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణ విషయమైపోయింది.

ఈ పార్టీ కాకుంటే ఆ పార్టీ అదీ కాకుంటే మరొకటి, ఆ తర్వాత ఇంకో పార్టీ ఈ విధంగా సినిమాల్లో కాస్టూమ్స్‌ మార్చినట్టుగా వీరు పార్టీలను మార్చేస్తున్నారు.

ఆశయాలు, లక్ష్యాలు, నిశ్చలమైన అభిప్రాయాల వంటివేమి లేకపోవడం వల్లనే సినిమా హీరోయిన్లు అలవోకగా పార్టీలు మారిపోతున్నారు. ప్రజాసేవ కోసం విలువలేని రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తున్నారు.

తెలుగుభాషను ఆదరించాలి: – ఎన్‌.రామకృష్ణ, హైదరాబాద్‌

నేడు పాఠశాలలో కూడా పూర్తిగా ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెట్టారు. దీనికంటే రెండు మాధ్యమాలు ఉండటం మంచిది.

కావాలనుకుంటే ఆంగ్లం నేర్చుకోవాలనే కుతూహలం ఉంటే ప్రతి పాఠశాలోనూ ‘ఆంగ్ల లాబ్‌ను ఏర్పాటు చేసి నిపుణులతో తర్ఫీదు ఇస్తే సరి. పిల్లలు అటు ఆంగ్లం, ఇటు తెలుగు రెండింటిని సులభంగా అభ్యసించిన వారవుతారు.

నేర్చుకున్న వారు అవుతారు. కనుక తెలుగు భాష పరిరక్షణకు మనమందరం పూనుకోవాలి.తెలుగు అంతరించిపోకుండా తెలుగు భాషావికాసానికి మనమం దరం కృషి చేయాల్సిన అవసరం ఉంది.

పెరుగుతున్న వాజ్యాలు: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

సుప్రీంకోర్టు, హైకోర్టులలో నలభై లక్షల వరకు వాజ్యాలు అప రిష్కృతంగా ఉన్నాయన్న జాతీయ న్యాయశాఖ నివేదిక ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సగటున ఒక వాజ్యం ముగియడానికి దాదాపుగా 186 సంవత్సరాల కాలం పడుతుంది.

ఈ సుదీర్ఘకాలంలో సాక్ష్యాలు తారుమారు, సాక్ష్యు లు దివంగతులవడం, ముద్దాయిలు దర్జాగా జీవితాన్ని అనుభవించడం జరుగుతుంది.

సుప్రీంకోర్టు, హైకోర్టులలో పనిభారం తగ్గించేందుకు కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ అన్న వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతిరాష్ట్రంలో వీటి బెంచీలు ఏర్పాటు చేయాలి.

న్యాయ మూర్తుల సంఖ్య పెంచడం, స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పా టు చేయడం, వివిధ ప్రభుత్వరంగ సంస్థల మధ్య తగవులు తీర్చేందుకు ప్రత్యేక కమిషన్‌ల ఏర్పాటు ప్రతి జిల్లాలో కోర్టుల ఏర్పాటు..

వంటి న్యాయకోవిదుల సూచనలను కేంద్ర ప్రభు త్వం, కేంద్ర లా కమిషన్‌ తక్షణం అమలు చేయాలి.

ప్రాజెక్టులకు మోక్షం కల్పించాలి:- ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరు జిల్లా

రాయలసీమ జిల్లా ప్రజల అవసరాలను తీర్చే లక్ష్యంతో మూడు దశాబ్దాల క్రితం రూపొందించిన గుండ్రేవ్ఞల ప్రాజెక్టు భవిష్యత్తు రెండు తెలుగు రాష్ట్రాలకు,కర్ణాటకరాష్ట్రానికి కుదిరే సయోధ్యపై ఆధారపడడం దురదృష్టకరం.

తుంగభద్ర జలాల ఆధారంగా రాయలసీమ తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే ఈప్రాజెక్టు పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్ష లాది మంది నీటి అవసరాలు తీరుతాయి.

అయితే తుంగభద్ర నదీజలాల వివాదంలో కర్ణాటకప్రభుత్వం ప్రారంభించిన న్యాయ పోరాటం కారణంగా ఈ ప్రాజెక్టు కాగితాలపైనే నిలిచిపోయింది.

ధరలను తగ్గించాలి:-ఎన్‌.కృష్ణమూర్తి, హైదరాబాద్‌

కరోనా దెబ్బకు సామాన్యుడి బతుకులు విలవిల్లాడు తు న్నాయి. అప్పులు పుట్టవ్ఞ. చేసిన అప్పులు తీరవ్ఞ. ఇదే వారికి తీరని వ్యధ.

నిరుద్యోగులు ఉన్న కుటుంబంలో మరీ ఇబ్బందులు.అలాగే విపణి మార్కెట్‌లో దాదాపుగా అన్ని రకాల నిత్యాసవర వస్తువుల ధరలు విపరీతమైన ధరల పెరుగుదల కారణంగా కొనే పరిస్థితి లేదు.

వంట సరుకులు,కూరగాయలు,అన్ని ధరలుఆకాశాన్ని అంటాయి. ఇక సామాన్యుడి సమస్యపట్టించుకునే వారేరి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/